డైట్ లో అగ్ని ప్రమాద భద్రత అవగాహన మరియు మాక్  డ్రిల్ నిర్వహణ కార్యక్రమం

డైట్ లో అగ్ని ప్రమాద భద్రత అవగాహన మరియు మాక్ డ్రిల్ నిర్వహణ కార్యక్రమం

24/March/2026 16:05    Share:   

దాడి  ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ ,అటానమస్ ,నందు అగ్ని మాపక సిబ్బంది వారు "అగ్ని ప్రమాద భద్రతా అవగాహన మరియు మాక్ డ్రిల్ల్ " కార్యక్రమం నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా  శ్రీ లక్ష్మణ రావు ,అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ,వారు మరియు వారి సిబ్బంది హాజరు అయి ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు మరియు టెక్నిషన్స్ కు అగ్నిమాపక ప్రమాదములపై అవగాహన మరియు నివారణ చర్యలు ,తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు ,ఇన్స్టిట్యూట్ లో గల ఫైర్ & సేఫ్టీ  పరికరములు తనిఖీ చేసి మాక్ డ్రిల్ల్ నిర్వహించారు .అగ్ని మరియు ఇతర ప్రమాదములు జరిగినప్పుడు విద్యార్థులు మరియు స్టాఫ్ తక్షణమే తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రాక్టికల్ గా చేసి చూపించారు.

ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ . వైకుంఠరావు గారు విద్యార్థులను మరియు స్టాఫ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇన్స్టిట్యూట్ లో ప్రతీ ఒక్కరూ ప్రమాదముల నివారణ కు మరియు తక్షణమే తీసుకోవలసిన జాగ్రత్తలను మరియు ప్రమాదములు జరిగినపుడు అందరు ఒకచోటకు చేరుకోవాల్సిన ప్రదేశము వారిగురించి వివరించారు . .ఈ కార్యక్రమములో విద్యార్థులు ,సిబ్బంది పాల్గొన్నారు .
Breaking News

Subscribe our Newsletter