శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో వైభవంగా పునర్నిర్మాణ పూజా కార్యక్రమాలు
23/February/2026 07:29
Share:
క్రైమ్ అనాలసిస్: A. Srinivasa Rao, అనకాపల్లి: స్థానిక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆలయ అభివృద్ధికి సంబంధించిన వివరాలను కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ వెల్లడించారు.ఆలయ డైరెక్ట్ కమిటీ మరియు సిబ్బందితో కలిసి ఆయన పూజా కార్యక్రమాల షెడ్యూల్‌ను వివరించారు 6, 7 తేదీలలో: ఆలయ ప్రాంగణంలో చండీ హోమంతో పాటు ఇతర విశేష హోమాలు శాస్త్రోక్తంగా జరగనున్నాయి.8వ తేదీన: అత్యంత భక్తిశ్రద్ధలతో కలశ స్థాపన మరియు అమ్మవారి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఈ పునర్నిర్మాణ మరియు ప్రతిష్ఠా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ యంత్రాంగం పకడ్బందీగా చేస్తోందని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.