ఎలమంచిలిలో 18 మందికి,12.40 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ఎలమంచిలిలో 18 మందికి,12.40 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

13/October/2026 20:35    Share:   

ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 18 మంది లబ్ధిదారులకు రూ.12,40,000 విలువైన చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ శ్రీ పప్పల చలపతిరావు గారు, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఇంచార్జ్ శ్రీ కొండపల్లి అప్పలనాయుడు గారు, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ బత్తుల తాతయ్యబాబు గారు హాజరయ్యారు.
అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం ద్వారా బాధిత కుటుంబాలకు కొంత ఊరట లభిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సహాయ పథకాలు అందేలా కృషి చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండడం తమ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎక్స్ స్టేట్ సెక్రటరీ మరియు యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ధూళి రంగనాయకుల గారు,  రూరల్ పార్టీ ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గొర్ల నానాజీ, అచ్యుతాపురం  మండల పార్టీ ప్రెసిడెంట్ పీల తులసీరామ్ గారు, PACS చైర్మన్ విజయబాబు గారు, PACS చైర్మన్ ఎరిపిళ్లి చిట్టిబాబు గారు, జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్ గారు, ఆర్ఎస్ నాగేశ్వరరావు గారు, ఆడారి ఆదిమూర్తి గారు,  ఎక్స్ ఎంపీపీ గొన్నబతుల నాగేశ్వరరావు గారు, నారాయణమ్మ గారు మరియు  స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter