పట్టపగలే ఇంట్లో చోరీ.. నాలుగు తులాల బంగారం, రూ.40 వేల నగదు అపహరణ..
03/August/2026 08:11
Share:
రాంబిల్లి, ఆగస్టు 2 :పట్టపగలే ఇంట్లో చోరీ చోటుచేసుకుంది. ఇంటి యజమానులు బంధువుల ఇంటికి వెళ్లి రెండు గంటల అనంతరం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఈ ఘటనతో వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా పగులగొట్టి సుమారు నాలుగు తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.40 వేల నగదును అపహరించి పరారయ్యారు.స్థానికుల సమాచారం మేరకు బాధితులు ఇంట్లో లేని సమయంలోనే దుండగులు ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.