ఏలూరు జిల్లా ఎస్పీ గారిని కలిసిన అనుదీప్ కుటుంబ సభ్యులు..
23/March/2026 21:43
Share:
ఏలూరు జిల్లా ఎస్పీ గారిని కలిసిన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చాట్రాయి అనుమానాస్పద స్థితిలో మృతి చేసిన అనుదీప్ కుటుంబ సభ్యులు.. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం..నిజాన్ని నిగ్గు తేల్చి హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ గారికి వినతిపత్రం అందజేసిన రెడ్డి అప్పల నాయుడు ప్రత్యేక అధికారితో విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఎస్పీ ప్రతాప్ కిషోర్ గారు.. ఏలూరు, మార్చి 23:- 10 రోజులు క్రితం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం లోని చాట్రాయి గ్రామంలో అంబటి అనుదీప్ అనే 17 ఏళ్ల కుర్రాడి అనుమానాస్పద మృతి చెందిన నేపథ్యంలో అనేక అనుమానాలు కలిగించే విధంగా ఉన్నాయని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న తరుణంలో అంబటి అనుదీప్ జనసేన పార్టీ జనసైనికుడు అని తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, జనసైనికులు ఆందోళన చేయడం అలానే స్థానిక మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు, జనసేన నాయకులు మండలి రాజేష్ , నియోజకవర్గం ఇంచార్జీ బర్మా ఫణి బాబు స్థానిక నేతలు వారి కుటుంబ సభ్యులను , తల్లితండ్రులను కలిసి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి ప్రత్యేక అధికారిని నియమించి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆదేశాలు ఇవ్వడం తో నేడు కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ గారిని కలిసి పూర్తిగా వివరాలు తెలిపి, వారికున్న అనుమానాలు అలానే స్థానిక పోలీసుల పనితీరు మీద ఎస్పీ గారికి తెలియచేసి అనుదీప్ మృతి వెనుక ఉన్న వ్యక్తులను వారికి సహకరించిన వారు ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అనుదీప్ కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ గారికి ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు వినతి పత్రాన్ని అందజేశారు.. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని నిజాన్ని నిగ్గు తేల్చి హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ నూజివీడులో ఇలాంటి సంఘటన జరగడం బాధకరమన్నారు. చనిపోయింది మా పార్టీకి చెందిన కార్యకర్త. జనసైనికుడు మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వారి తల్లితండ్రుల ఆవేదనను అర్థం చేసుకున్నానన్నారు. ఏలూరు జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ తో మాట్లాడి స్పెషల్ ఎంక్వయిరీ వేయమని మంత్రి కొలుసు పార్థసారథి సైతం ఆదేశించారన్నారు. అంబటి అనుదీప్ కుటుంబ సభ్యులను పేరుపేరునా పరామర్శించి, మీకు నచ్చిన అధికారి, మీరు మెచ్చిన అధికారి, ఎవరైనా ఉంటే మీకు నచ్చిన విధంగా ఎంక్వయిరీ వేస్తానని మంత్రి కొలుసు హామీ ఇచ్చారు. నూజివీడు నియోజకవర్గ పోలీసు వారే కాకుండా ఇతర ప్రాంత పోలీస్ అధికారులను ఎంక్వయిరీ వేసి, సమగ్ర నివేదిక సమర్పించాలని, నిజం నెగ్గు తేర్చాలని, తల్లిదండ్రుల యొక్క అనుమానాన్ని తీర్చాలని, సిసి ఫుటేజ్ మరియు చెరువుగట్టు పరిసర ప్రాంతాలు గ్రామంలో ప్రధాన రహదారులున్న సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం పరిశీలించి నిజాన్ని తేల్చాలన్నారు.. తల్లిదండ్రులతో మాట్లాడిన ఆయన బంధు ప్రీతి, కులప్రీతి, ప్రాంతీయ ప్రీతి, రాజకీయ ప్రీతికి తావు లేకుండా,అన్నింటికీ అతీతంగా, న్యాయం జరిగేటట్లు అన్ని విధాల న్యాయం చేస్తానని, ధర్మాన్ని గెలిపిస్తానని, ఈ విషయంలో అన్యాయం జరిగినట్లు తేలితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన మాట ఇచ్చారు.. నిజాన్ని బయటకు తీసి ఈ పరిణామానికి పాల్పడిన వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో చాట్రాయి మండల టిడిపి అధ్యక్షులు ఇజ్జగాని వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ నాయకులు తుమ్మల జగన్, రెవినిశెట్టి జితేంద్ర, పాశం నాగబాబు, ఏడుకొండలు, అంబటి గోపి, చంటి, సత్యనారాయణ, శేఖర్, విజయ్, ఈశ్వర్ వారితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..