అర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ పనులను సమీక్షించిన అనకాపల్లి ఎంపీ.

అర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ పనులను సమీక్షించిన అనకాపల్లి ఎంపీ.

23/March/2026 09:15    Share:   

నక్కపల్లిలో అర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను మంత్రులు తో కలసి పరిశీలించిన అనకాపల్లి ఎం.పీ 
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రతిష్టాత్మక అర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత గారు,గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు,ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి గారు,సీఎం టూర్ కోఆర్డినేటర్ సత్యనారాయణ రాజు గారు,ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు గారు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారు, జేసీ శౌర్యమన్ పటేల్ గారు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు తదితరులతో కలిసి సభ స్థలాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.వేదికపై ఏర్పాట్లు, గ్యాలరీలో సదుపాయాలను సమీక్షించి పలు సూచనలు చేశారు. పనుల పురోగతిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. భారీగా జన సమీకరణ జరిగే నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ గారు మాట్లాడుతూ సుమారు రూ.1.50 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పడనున్న ఈ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.లక్ష మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయని తెలిపారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ కీలక భూమిక పోషించనుందని పేర్కొన్నారు.
Breaking News

Subscribe our Newsletter