ట్రాఫిక్ నియమాలు పాటిచాలి..ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్

ట్రాఫిక్ నియమాలు పాటిచాలి..ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్

21/March/2026 06:40    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు 
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ గారు నూజివీడు డిఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ గారి ఆదేశాల పై కలపర్రు టోల్ గేట్ వద్ద ఈ రోజు అనగా 20.03.2026 వ తేది నాడు హెల్మెట్ అవగాహన కార్యక్రమమును నిర్వహించిన పెదపాడు ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ గారు వారి యొక్క సిబ్బంది
పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో పెదపాడు ఎస్ఐ ఆర్. శ్రీనివాస్ గారు సిబ్బందితో కలపర్రు టోల్ గేట్ వద్ద బైక్ రైడర్ల కు హెల్మెట్ అవగాహన నిర్వహించారు.
స్థానికంగానే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నటువంటి వారికి జరిమానా విధించకుండా హెల్మెట్ లను కొనుగోలు చేయించారు.హైవేపై హెల్మెట్ లేకుండా ప్రయాణం చాలా ప్రమాదకరం, ప్రాణాలకు హాని కలిగి స్తుందని తెలియ జేశారు.
కారు డ్రైవర్లకు సీట్ బెల్ట్ తప్పనిసరి అని సూచించారు.
మీ కుటుంబం మీతో ఎదురు చూస్తోంది, అతివేగం, నిర్లక్ష్యం వల్ల మీకు, ఇతరులకు ప్రమాదాలు జరుగుతాయి. ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా గమ్య స్థానాలకు చేరండి అని పెదపాడు ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ స్పష్టం చేసినారు.
Breaking News

Subscribe our Newsletter