ఉపాధి హామీ చట్టం మార్చి పేదల పొట్టలు కొట్టొద్దు, సిఐటియు..

ఉపాధి హామీ చట్టం మార్చి పేదల పొట్టలు కొట్టొద్దు, సిఐటియు..

02/July/2026 09:38    Share:   

కేంద్ర ప్రభుత్వం నేటి నుండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి విబి రాంజీ పథకంగా నేటి నుం అమలులోకి తెస్తున్నది దీనిని నిరసిస్తూ దేశ వ్యాప్త పిలుపులో భాగంగా  ఉప్పవరం ,దుప్పుతురు, తిమ్మరాజుపేట, హరిపాలెం గ్రామాల్లో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్రావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో తీసుకొచ్చిన వీబీ జి రామ్ జి చట్టానికి స్వస్తి పలికి, గతంలో ఉన్న పాత పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు, వ్యవసాయ కూలీలకు ఉపాధిహామీ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తోందని అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 60 శాతం మాత్రమే ఇస్తానని మిగతా 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదనే సాకుతో కేంద్రం చేతులు దులుపుకునే పనిచేస్తున్నదన్నారు. ఉపాధి హామీ పని రక్షణకై ఉపాధి శ్రామికులందరూ ఐక్యం కావాలని కోరారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ కే సోము నాయుడు, రైతుసంఘం నాయకులు , కన్నుం నాయుడు, రామ్ కుమార్, బాబురావు ఆర్ సత్తిబాబు   పి వరలక్ష్మి డి సంజీవి మ్మ తదితరులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter