భయం లేకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయండి..!

భయం లేకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయండి..!

18/July/2026 21:44    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :

 అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు యలమంచిలిలోని సెయింట్ మేరీస్ స్కూల్‌లో శనివారం టౌన్ ఎస్‌ఐ సావిత్రి ఆధ్వర్యంలో విద్యార్థినుల భద్రతపై 'అభయ' అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత భద్రతపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఆకతాయిల వేధింపులు లేదా ఇతర సమస్యలు ఎదురైనప్పుడు ఎలాంటి భయం లేకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్‌ఐ సావిత్రి సూచించారు.విద్యార్థినుల సౌకర్యార్థం ప్రతి పాఠశాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమకు ఎదురయ్యే సమస్యలను కాగితంపై రాసి అందులో వేయవచ్చని, వాటిపై గోప్యంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.అలాగే అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం పొందేందుకు ఉపయోగపడే పోలీసు హెల్ప్‌లైన్ నంబర్లు, అత్యవసర సేవల గురించి కూడా విద్యార్థినులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter