
తేదీ: 30 జూలై, 2026
యలమంచిలి పట్టణంలోని సబ్ జైలును మండల న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి పి. విజయ గురువారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె జైలులోని ముద్దాయిలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఖైదీని వ్యక్తిగతంగా కలిసి వారి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
శ్రీమతి పి. విజయ మాట్లాడుతూ, ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం అవసరమైతే ప్రభుత్వ న్యాయవాదులను కేటాయించి బెయిల్ పొందేందుకు సహాయం చేస్తామని ఖైదీలకు తెలియజేశారు.
ఖైదీలకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, జైలులో ఎదురవుతున్న ఇతర సమస్యలేమైనా ఉన్నాయా అని ఆమె వివరంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సబ్ జైలు సిబ్బంది, న్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.