అధికారంలో ఉన్న లేకున్నా ప్రజల పక్షాన పోరాడే తత్వం జన సైనికులు, వీర మహిళల్లో ఉంది..

అధికారంలో ఉన్న లేకున్నా ప్రజల పక్షాన పోరాడే తత్వం జన సైనికులు, వీర మహిళల్లో ఉంది..

18/May/2026 07:50    Share:   

* రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్క జనసైనికులు, వీరమహిళలు సన్నధమై ఉండాలి..
 
* నిబద్ధత, క్రమశిక్షణ, పోరాడే తత్వాలను పవన్ కళ్యాణ్ గారు మొదటినుండి జన సైనికులు వీర మహిళలకు నేర్పారు..

* పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు వెల్లడి..

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,

జనసేన పార్టీకి జన సైనికులు, వీర మహిళలు అసలైన బలమని, వారి కృషితోనే పార్టీ పటిష్టంగా ఉందని ఏపీఎస్ఆర్టీసీ జోన్ 2 చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలు చర్చించుటకై ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సన్నధమై ఉండాలని సూచించారు. జనసైనికులు అభిమతం మేరకే జనసేన పార్టీ ముందుకు సాగుతుందన్నారు. మనం అధికారంలో ఉన్న, లేకున్నా, ప్రజల కోసం పోరాడే జనసైనికులు, వీర మహిళలు ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే అని అన్నారు. నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజల కోసం పోరాడే తత్వాలను జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుండి జనసైనికులకు నేర్పారన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా జనసేన కార్యకర్తలు, వీర మహిళల తరఫున తాను పోరాడుతానని ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ఉద్ఘాటించారు. జనసేనలో జనసైనికులు, వీర మహిళలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని, కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక వ్యవస్థను రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేస్తారని అన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఏలూరులో పలు కమిటీలను వేయనున్నామని, అందుకు జనసైనికులు, వీర మహిళలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎవరైతే పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నారో, వారికి జనసేన పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. ఏలూరులో సైనికులు జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను కొనసాగించాలని, ఎన్డీఏ కూటమికి అంకితభావంతో కట్టుబడి పని చేయాలన్నారు. 62 డివిజన్ లోను పోటీ చేసే శక్తిని జనసైనికులు, వీర మహిళలు, నాయకులు సమాయత్తం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఏలూరు జనసేన పార్టీలో పలు కమిటీలను వేయనున్నామని, దానికి ప్రతి ఒక్కరూ సంసిద్ధం కావాలన్నారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, సీనియర్ నాయకులు రాఘవయ్య చౌదరి, రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణి, రాష్ట్ర చేనేత వికాస విభాగ కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్,జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంకి పండు, కార్పోరేటర్లు పొలిమేర దాసు, కోయ సత్తిబాబు, నగర అధ్యక్షులు వీరంకి పండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, క్లస్టర్ ఇంచార్జీలు, డివిజన్ ఇంచార్జీలు, వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు పాల్గొన్నారు..
Breaking News

Subscribe our Newsletter