యలమంచిలిలో పోలీసుల మెగా కార్డన్ అండ్ సెర్చ్: 10 బైక్‌లు స్వాధీనం

యలమంచిలిలో పోలీసుల మెగా కార్డన్ అండ్ సెర్చ్: 10 బైక్‌లు స్వాధీనం

13/June/2026 11:57    Share:   

యలమంచిలి:
రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ఆపరేషన్ వజ్రప్రహార్" లో భాగంగా శనివారం (13.06.2026) ఉదయం యలమంచిలి పట్టణంలో పోలీసులు భారీ తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని టీడ్కో కాలనీ, రామనగర్ పరిసర ప్రాంతాలలో ఉదయం 05.30 గంటల నుండి 08.30 గంటల వరకు ఈ మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది.ఈ తనిఖీల్లో మొత్తం 50 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ముమ్మరంగా సాగిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 220 ఇళ్లను జల్లెడ పట్టారు.స్థానికంగా నివసిస్తున్న 270 మంది వ్యక్తులను అడిగి వారి వివరాలను సేకరించారు.సరైన పత్రాలు (Documents) లేని 10 మోటార్ సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు.
సమాజంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, మాదకద్రవ్యాల (Drugs) రవాణా మరియు వినియోగంపై ఉక్కుపాదం మోపడం, అలాగే అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడమే లక్ష్యంగా ఈ "ఆపరేషన్ వజ్రప్రహార్" నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఈ తనిఖీ కార్యక్రమానికి స్థానిక ప్రజలు పూర్తిగా సహకరించినందుకు యలమంచిలి టౌన్ పోలీసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టణంలో శాంతిభద్రతలను కాపాడటానికి, ప్రజల రక్షణ కోసం భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

 
Breaking News

Subscribe our Newsletter