శారదా నది గ్రోయిన్ల మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొణతాల
23/May/2026 19:45
Share:
అనకాపల్లి మండల పరిధిలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా శారదా నదికి సంబంధించిన గ్రోయిన్లు దెబ్బతినడంతో, స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా తుమ్మపాల గ్రామంలోని స్మశాన వాటిక సమీపంలో ఉన్న 'ఎల్లయ్య గ్రోయిన్' మరమ్మతుల కోసం సుమారు రూ. 1.19 కోట్ల నిధులను ఆయన మంజూరు చేయించారు. ప్రస్తుతం ఈ నిధులతో నీటి సంఘాల పర్యవేక్షణలో మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పనులు జరుగుతున్న తీరును ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఏఈ రూపాను అడిగి పనుల పురోగతి గురించి వివరాలు తెలుసుకున్నారు. నాణ్యతలో రాజీ పడవద్దని, వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను గట్టిగా ఆదేశించారు. అనంతరం మూలపేట గ్రామంలో కొలువైన శ్రీశ్రీశ్రీ గంగాలమ్మ తల్లిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘాల చైర్మన్లు, స్థానిక రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మరియు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీనివాస్ ఏ క్రైమ్ ఎనాలిసిస్, జిల్లా ఇన్చార్జ్.అనకాపల్లి.