పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న కల్తీ మాఫియా..

పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న కల్తీ మాఫియా..

26/February/2026 20:26    Share:   

జిల్లాలో పాలు నాణ్యత పై అనుమానాలు.. రాజమండ్రి ఘటనతో ఉలిక్కిపడుతున్న జనం.. ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్ధకం..
నగరంలో పెరుగుతున్న కల్తీ వస్తువులు..చాపకింద నీరులా మారిన అధికారుల చర్యలు..
తనిఖీల్లో అధికార యంత్రాంగం పూర్తి నిర్లక్ష్యం  - ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు ధ్వజం
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు
ఏలూరు, ఫిబ్రవరి 26:- ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పాలు పాల పదార్థాల కల్తీ యదేచ్ఛగా కొనసాగుతుందని ఆర్టీసి జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు.. ఇటీవలే రాజమండ్రిలో కల్తీ పాలు పలువురి ప్రాణాలు తీసిన నేపథ్యంలో ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని  ఏర్పాటు చేశారు.. ఆయన మాట్లాడుతూ తనిఖీ అధికారులు నిర్లక్ష్య వైఖరి మూలంగానే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కల్తీ పాలను తయారు చేస్తున్నారన్నారు.. ఇది యదార్ధమైన విషయం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంతో విలువలతో కూడిన పరిపాలనను అందిస్తుంటే కొన్నిచోట్ల అధికారుల నిర్లక్ష్యం క్లుప్తంగా కనిపిస్తుంది.. ప్రజలు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కృషి చేస్తుంటే కొంతమంది దుర్మార్గపు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి కల్తీలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదం జరిగితేనే మీరు స్పందిస్తారా అని ప్రశ్నించారు.. తనిఖీ అధికారులు మీరు గమనించుకోవాలి ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుంటూ ఇప్పుడు చేస్తున్న నిర్లక్ష్య ధోరణిని విడనాడాలన్నారు.. ప్రతి డిపార్ట్మెంట్ లోనూ తనిఖీ అధికారులు తనిఖీని చేపట్టాలన్నారు.. ప్రస్తుతం వారు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదన్నారు..

 ప్రజల అవసరాలకు తగినట్లు పాల ఉత్పత్తి లేక పోగా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు అక్రమార్జన కోసం, కల్తీ కి పాల్పడుతున్నారన్నారు. వీటివల్ల ప్రజారోగ్యానికి ముప్పు పొంచి ఉన్న, అధికారులు మాత్రం మొక్కుబడి తనిఖీలతో ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారని, అధిక లాభాల కోసం ఒకప్పుడు రైతులు పాడి పశువులను పోషిస్తూ పాల వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం ఉపాధి మార్గంగా మార్చుకున్న కొందరు దళారులు ఈ వ్యాపారంలోకి వస్తున్నారు. పట్టణాలు నగరాల్లో కాస్త స్థలం ఉంటే చాలు షెడ్డు నిర్మించి, గేదెల ఫారం పెట్టి, వ్యాపారం ప్రారంభిస్తున్నారు.. నీళ్లు కలపని పాలు అంటూ ప్రచారం చేస్తూ, లీటర్కు 100 పైగా విక్రయిస్తున్నారు.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇదే తరహాలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వ్యాపారాలు వెలుస్తున్నాయి. ఇంత జరుగుతున్న పశుసంవర్ధక, ఆహార నియంత్రణ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు.. కొందరు పశుపోషకులు పేరుతో సైకిళ్ళు మోటార్ సైకిల్ లపై దాదాపు పది నుంచి 15 కిలోమీటర్ల ప్రయాణించి పాలు సరఫరా చేస్తున్నారు.. ఇందుకు గ్రామాల్లో పాలు సేకరించి అక్కడే ప్రాసెసింగ్ చేస్తున్నారు.. వెన్న గ్రేడింగ్ ప్రకారం ధర నిర్ణయిస్తున్నారు.. ఇందుకోసం అసలైన రైతు నుంచి సేకరించిన అధిక లాభాల కోసం వివిధ ప్రక్రియల పేరుతో రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.. కొందరు చిరు వ్యాపారులు ఎలాంటి బ్రాండ్లు లేకుండా పాలు పెరుగు నెయ్యి తదితర ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.. ఆయా ఉత్పత్తులు నాణ్యంగా ఉండటానికి అవసరమైన జాగ్రత్తలను తీసుకోవడం లేదు.. ప్రజలకు నాసిరకం పాల ఉత్పత్తులు అంటగడుతున్నారు. పల్లెల్లో పాడి ప్రాంతం నుంచి పాలు కనుగోలు చేసి, సమీప పట్టణాల్లో విక్రయించే చిరు వ్యాపారులు మార్గమధ్యలో కాలువల్లోని నీటిని కలిపేస్తున్న ఉదాంతాలు చాలానే ఉన్నాయన్నారు.. వారు కలిపే నీళ్లు శుభ్రంగా లేకపోతే, ఆయా పాలను వినియోగించిన వారు, అనారోగ్యాల బారిన పడే ముప్పు ఉంది.. కొందరు రైతుల కృత్రిమ పద్ధతుల్లో పాల దిగుబడిని పెంచేందుకు పశువులకు నిషేధిత యాక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇస్తున్నట్లు తెలుస్తుందన్నారు.. కొందరు ఔషధ వ్యాపారులు వీటిని గుట్టుగా విక్రయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.. ఇలాంటి పాలు తాగిన వారికి హార్మోన్ల సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.. కొందరు పాలలో నీళ్లు కలుపుతున్నారు.. చిక్కదనం కోసం, గంజిపొడిని కలుపుతున్నారని ఆరోపించారు.. అధికారులు ఇలాంటి వాటిపై నిఘా పెట్టారా లేక రూపాయి కారి ఒప్పందం వల్ల అటువైపు కన్నెత్తి చూడట్లేదా అనే విమర్శింశారు.. ఏలూరు నగర పరిధిలో ప్రతి చిన్న బండి వ్యాపారస్తుల నుండి కిరాణా షాపు వరకు కార్ఖానాలో తయారు చేస్తున్న తిరుబండారాలు నగరంలో కొన్నిచోట్ల చిరుతిళ్లు తయారు చేసే వ్యాపారస్తులు, అనేక రసాయనాలు వాడుతూ, నాణ్యత లేకుండా తయారు చేస్తూ, వాటిని వ్యాపారులకు విక్రయిస్తున్నారు.. నగరంలోని స్వీట్ హోమ్ యాజమాన్యం కూడా ఇదే తరహా రసాయనాలు వాడుతూ, వివిధ రకాల స్వీట్ల పేరుతో ప్రజల ఆరోగ్యానికి హానికరంగా వ్యవహరిస్తూ, వారి వ్యాపారమే ముఖ్యమనే విధంగా సంబంధిత అధికారులకు నెలకు పంపించాల్సిన మామూలు పంపిస్తే చాలు అని, వారు ఎటువంటి తినుబండారాలు అమ్మిన అధికారాలు మాత్రం పట్టించుకోరని ఆరోపించారు.. సంబంధిత అధికారులు ఒక్కరోజు వారి విధులను సక్రమంగా నిర్వర్తిస్తే, ఏలూరు నగరంలోను కల్తీ మాఫియా పై ఉక్కు పాదం మోపవచ్చని, ఎప్పటికప్పుడు నిఘా పెట్టి, కల్తి మాఫీయాకు అడ్డుకట్ట వేయాలని కోరారు.. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి, కల్తీ తినుబండారాలు వ్యక్రయిస్తున్న ప్రతి ఒక్కరిపై చర్య తీసుకోవాలని ఆయన కోరారు.. కల్తీ వ్యాపారం చేస్తున్న వారిపై చట్టపర్యమైన, తీవ్ర చర్యలతో పాటు జైలు జీవితం కూడా గడపవలసి వస్తుందన్నారు.. దీన్ని జనసేన పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.. ఇప్పటికైనా తనిఖీ అధికారులు మేల్కొవాలని, మామూలుకు ఆశపడి, ప్రజల జీవితాలతో, ప్రజల ప్రాణాలతో ఆటలాడొద్దని ఈ సందర్భంగా హెచ్చరించారు.. మీడియా సమావేశంలో నగర అధ్యక్షులు వీరంకి పండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రాము నాయుడు, పైడి లక్ష్మణరావు, కూనిశెట్టి మురళి కృష్ణ, బెజవాడ నాగభూషణం, జనసేన రవి, కొండల ప్రసాద్, వాసా సాయి, ముత్యాల కొండబాబు, జనపరెడ్డి తేజ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..
Breaking News

Subscribe our Newsletter