భక్తులను ఆకట్టుకున్న ఆజ్ఞాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు

భక్తులను ఆకట్టుకున్న ఆజ్ఞాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు

05/March/2026 07:41    Share:   

యలమంచిలి: మండలంలోని వెల్చూరు పంచాయతీ సంతపాలెం గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన శ్రీ కృష్ణభగవానుని ఆలయం ప్రారంభం, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంను బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కిల్లాడ మంగయ్యమ్మ కుమారుడు యువనేత కిల్లాడ చినబాబు ఆధ్వర్యంలో ఉదయం నుంచి వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి శుభ మహూర్తాన శ్రీకృష్ణుడు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తుల ఆరాధ్యదైవమైన శ్రీ కృష్ణభగవానుడిని స్థానికులే కాకుండా సమీప గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో దర్శించి పూజలు చేశారు. తమ మొక్కులు చెల్లించుక ఉన్నారు. స్వామివారిని దర్శించేందుకు భక్తులు గుడివద్ద గుమ్మికూడారు. రాష్ట్ర యాదవ కార్పోరేషన్ డైరక్టర్, టీడీపీ రాష్ట్ర కార్య దర్శి ధూళి రంగనాయకులు, జనసేన పార్టీ రాంబిల్లి మండల కార్యదర్శి పప్పల నూకన్నదొర, కూటమి నేతలు డిఎస్ఎన్రాజు లాలం తాతబాబు, గబ్బర్సింగ్, అనకాపల్లి నాగరాజు, జడ్పీటీసీ సభ్యులు ధూళి నాగరాజు, రాజుకోడూరు సర్పంచ్ ముత్తా శంఖర్రావు తదితరులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. మధ్యాహ్నం స్వామివారి ఆలయం ప్రాంగణంలో భారీ అన్నస మారాధన కార్యక్రమంను నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి ఆలయం ఆవరణలో నిర్వహించి పలు ఆజ్ఞాత్మిక, సాంస్కుృతిక కార్యక్రమాలు, విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Breaking News

Subscribe our Newsletter