జాతీయ రహదారిపై అనధికార పార్కింగ్‌పై కొరడా..!  వాహనదారులకు జరిమానాలు..!!

జాతీయ రహదారిపై అనధికార పార్కింగ్‌పై కొరడా..! వాహనదారులకు జరిమానాలు..!!

22/May/2026 19:26    Share:   

కన్నేపల్లి నాగ శ్రీనివాస్ శర్మ ( క్రైమ్ అనాల్సిస్ ప్రతినిది )
యలమంచిలి మండలంలోని జాతీయ రహదారి-16పై నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా వాహనాలు పార్క్ చేస్తున్న వారిపై యలమంచిలి రూరల్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. శుక్రవారం రూరల్ ఎస్ఐ ఉపేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు హైవేపై విస్తృత తనిఖీలు నిర్వహించారు.రహదారి భద్రతకు విఘాతం కలిగిస్తూ, ప్రమాదాలకు కారణమయ్యేలా రోడ్డుపై నిలిపి ఉంచిన పలు మోటారు వాహనాలకు పోలీసులు భారీగా జరిమానాలు విధించారు. అనంతరం పులపర్తి జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్ఐ ఉపేంద్ర మాట్లాడుతూ, రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని హెచ్చరించారు.జంక్షన్ల వద్ద రహదారికి ఇరువైపులా అడ్డదిడ్డంగా ఆటోలను నిలపడం వల్ల ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశముందని తెలిపారు. అందువల్ల నిర్దేశిత ప్రాంతాల్లోనే వాహనాలను పార్క్ చేయాలని సూచించారు.ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహన పత్రాలను వెంట తీసుకెళ్లాలని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రూరల్ పోలీస్ సిబ్బందితో పాటు స్థానిక ఆటో కార్మికులు, వాహనదారులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter