కార్మికుల సమస్యలపై డిసెంబర్ 1న చలో ఢిల్లీ ( సిఐటియు )

కార్మికుల సమస్యలపై డిసెంబర్ 1న చలో ఢిల్లీ ( సిఐటియు )

21/November/2026 21:06    Share:   

సిఐటియు  కార్మికుల సమస్యలపై డిసెంబర్ 1న చలో ఢిల్లీని జయప్రదం చేయాలని కోరుతూ అచ్చుతాపురం ఎస్ ఈ జడ్ లో విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము మండల కార్యదర్శి కె. సోము నాయుడు.ఈ మాట్లాడుతూ అఖిలభారత పిలుపులో భాగంగా డిసెంబర్ 1న చలో ఢిల్లీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.  కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు గడిచిందని ఈ కాలంలో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయలేదని కార్మికుల నష్టం కలిగించి యజమానులకు లాభాలు తెచ్చే నాలుగు లేబర్ కోడ్స్ ని తీసుకొచ్చిందని. గత 12 సంవత్సరాల కాలంగా పరిశ్రమ కార్మికులకు, స్కీముల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచలేదని, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని కార్మికుల వేతనాలు పెరగక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని.షెడ్యూల్ పరిశ్రమలలో పనిచేసే కార్మికులు కి 15 సంవత్సరాలుగా వేతనాల జిఓ సవరణ చేయలేదని.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేశారని, దేశవ్యాప్తంగా లక్షలాది ఖాళీలు భర్తీ చేయకపోవడం వలన యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న భవననిర్మాణ, ముఠా కార్మికులు, ఆటో, మోటార్ కార్మికులకు ఎటువంటి రక్షణ లేకుండా పోయిందని. దేశ సంపద అయిన భూమి, అడవి నీరు కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి కంపెనీలకు ఊడిగం చేస్తున్నారని. సర్ పేరుతో దేశంలో 13 కోట్ల ఓట్లను రద్దు చేశారని  బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తుందని. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలు కి రక్షణ కల్పిస్తున్నాం అని చెబుతున్నదని, విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సమ్మిట్ లో కార్పొరేట్ కంపెనీలకు ఎర్రతి వాచీని పరిచారని.భూములు కారు చావుగా కట్టబెడుతూ, వేల కోట్ల రాయితీలు కంపెనీలకు ఇస్తున్నారని అందులో పని చేసే కార్మికులకు మాత్రం వేతనాలు పెంచడం లేదని  కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ ఒకటి నుండి జరుగు చలో ఢిల్లీ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న కార్మికులు అంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  సిఐటియు నాయకులు రాజన్న సత్తిబాబు , చేపల తాతయ్య,కారు దేముడు, మామిడి నాయుడు, రాజన సంజీవిరావు గండి బాబ్జి ,రెడ్డి రామునాయుడు, మోటూరు అప్పలరాజు, రాజన్న సన్యాసిరావు, నగిరెడ్డి చిరంజీవి, మాసరపు నాయుడు, జి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter