ప్రొఫెసర్ నాగేశ్వరావు జనసేన పార్టీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన రెడ్డి అప్పలనాయుడు..
22/May/2026 19:44
Share:
* కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారిని మా పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్య మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, PAC చైర్మన్, సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కలిసి జగన్ ను అరెస్ట్ చేయండి అని చెబితే, అమిత్ షా గారు వారితో జగన్ లాంగ్ టైమ్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు గారు షార్ట్ టైమ్ ఫ్రెండ్ అని చెప్పారని తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు..?? జగన్ రెడ్డికి మద్దత్తుగా సోషల్ మీడియా లో మాట్లాడితే 4 లేక 5 రూపాయలు ఇస్తారు. కానీ నాగేశ్వరావు గార్కి భారీ మొత్తంలో ఇచ్చారు ఏమో వైసీపీ పార్టీ వాళ్ళు. అందువల్లనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేసి, అప్పుల్లో కి నెట్టివేసిన విషయం అందరికి తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధి కోసం, కేంద్రం నుండి నిధులు తేవడానికి, జలజీవన్ మిషన్ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు, తప్పితే రాజకీయాల కోసం కాదు. జగన్ సొంత నియోజకవర్గం లో జలజీవన్ మిషన్ అభివృద్ధి చేసింది డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు.ఇవేమి తెలుసుకోకుండా ప్రొఫెసర్ నాగేశ్వరావు వైసీపీ పేటియం బ్యాచ్ లో చేరి భారత దేశ హోమ్ శాఖ మంత్రి గారిని కూడ తక్కువ చేసి మాట్లాడం చాలా దారుణం అన్నారు. హైదరాబాద్ లో కూర్చుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కోసం నాగేశ్వరావు మాట్లాడం ఏమిటి.?? వైసీపీ ప్రభుత్వంలో చేసిన విధ్వంసాలు, కూటమి ప్రభుత్వం లో చేస్తున్న అభివృద్ధి పనులు ఆయనకు కనపడటం లేదా..? అని ప్రశ్నించారు. నాగేశ్వరావు పనిచేసిన పత్రికలు, ఛానల్స్ అభివృద్ధి జరగలేదు.అభివృద్ధిని అడ్డుకోవడానికి కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టడానికి కొంతమంది పని చేస్తున్నారని తెలిపారు.జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక, వైసీపీ పేటీఎం బ్యాచ్తో ఈ మేధావి ముసుగులో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీరు విశ్లేషించే అనాలిస్టుగా మాట్లాడుతున్నారా..?? లేక ఒక రాజకీయ వర్గానికి అనుకూలంగా మాట్లాడే వ్యక్తిగా మారిపోయారా..?? అక్రమ కేసులు ఎదుర్కొంటూ ప్రజల విశ్వాసం కోల్పోయిన నాయకులను, డిఫైన్ చేస్తూ, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిపై అనవసర వ్యాఖ్యలు చేయడం మీ స్థాయికి తగదన్నారు. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలలో అనేక సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద తమకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని పాలసీపరంగానే వ్యతిరేకిస్తున్నామని, జగన్ రెడ్డి పాలనలో జరిగిన విధ్వంసాన్ని ఆపడానికి మాత్రమే తాము పొట్టు పెట్టుకున్నట్లుగా అనేక సందర్భాల్లోను పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. ఈ విషయం ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా తెలుసని, కానీ అలా ఎందుకు ఆయన మాట్లాడారో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. జనసేన పార్టీ సిద్ధాంతాల మీద నడిచే పార్టీ, అందరు బాగుండాలని కోరుకునే ఏకైక పార్టీ అని అన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేటప్పుడు కేవలం రాష్ట్రానికి రావలసిన నిధులు గురించి, ఆగిపోయిన ప్రాజెక్టులను ఎలా పూర్తి చేయాలని విషయం మీద మాత్రమే మాట్లాడుతారని, ఎలాంటి వ్యక్తిగత విషయాలను చర్చించరు అని అన్నారు. అందులో భాగంగానే దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు పర్యటించని ఏజెన్సీ ఏరియాలో, పర్యటించిన విషయం గాని, డోలిమోతల నుండి వారి ప్రాంతాలకు విముక్తి కలిగించే, అంబులెన్స్ వెళ్లే విధంగా రోడ్లు వేయించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది అన్నారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి శాఖలోనూ మెరుగైన ఫలితాలు ఏ విధంగా కనబరుస్తున్నారో రాష్ట్ర ప్రజానీకం అంత చూస్తుందని తెలియజేశారు. వైకాపా ప్రభుత్వంలో నాశనమైన ప్రతి వ్యవస్థను గాడిలో పెడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఇదే విధంగా, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి అండగా నిలబడాలని కోరారు.2014లోనే రాజకీయ ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ, అధికారం కోసం కాదు, ప్రజల కోసం, రాజకీయాలు చేయాలని నిర్ణయించుకుని, పారదర్శకత, జవాబుదారితనం, నిజాయితీ అనే విలువలతో ముందుకు సాగుతున్న నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు.. ఒకరిని అరెస్టు చేయించడానికి, ఒకరిని కట్టడి చేయడానికి, ఓడించడానికి లేదా గెలిపించడానికి ఆయన రాజకీయాలు చేయడం లేదు.. ప్రజా ప్రయోజనాల కోసం, సేవ చేయడం కోసం మాత్రమే ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు పని చేస్తున్నారన్నారు..పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖకు జాతీయ స్థాయిలో 13 అవార్డులు అందుకున్నాయి. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న రోడ్డు సమస్యలను పరిష్కరించారు. స్టీల్ ప్లాంట్లో, పోలవరం, రాయలసీమ, రైల్వే ఎయిర్పోర్ట్లు, నూతన కంపెనీలో ప్రాజెక్టులు వంటివి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే విధంగా కృషి చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.. ఎన్నో విపత్కర పరిస్థితిలో ఎవరి సహాయం లేకుండా ధైర్యంగా నిలబడ్డ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, మీరు చేసే ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. జరిగినది జరుగనట్టుగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత, ఒక అనలిస్టుగా యూట్యూబ్ స్టూడియోలో కూర్చొని కల్పిత కథనాలు సృష్టించడం మానుకోవాలన్నారు. మీరు చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఏలూరు జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితి పూర్తిగా కోల్పోతారు అని స్పష్టం చేశారు. ఆధారాలు లేని విమర్శలు చేయడం మానుకొని, వెంటనే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి అని, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే తమ స్పందన వేరుగా ఉంటుందని జనసేన పార్టీ నుండి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో ఎండలు విపరీతంగా ఉన్నాయని రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రభుత్వం వారు చెప్పిన సలహాలు సూచనలు పాటించి తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా ఆయన తెలియజేశారు. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ,రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షుడు వీరంకి పండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నాయకులు బోండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్, జగపతి మనోహర్ స్వామి, కొండల ప్రసాద్, బుధ్ధా నాగేశ్వరావు, జనపరెడ్డి తేజ ప్రవీణ్,జనసేన రవి, వాసా సాయి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు..