ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రపంచ మత్స్య దినోత్సవం..

ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రపంచ మత్స్య దినోత్సవం..

21/November/2026 21:02    Share:   

ఎలమంచిలి, నవంబర్ 21: ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థలో మత్స్య రంగం ప్రాధాన్యత, ఉపాధి కల్పన, ఆహార భద్రతలో దాని పాత్రను వివరించారు.

జంతుశాస్త్ర విభాగాధిపతి డా. కె. సుజాత మాట్లాడుతూ.. మత్స్య రంగంలో సుస్థిర అభివృద్ధి ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు.

కార్యక్రమంలో IQAC కోఆర్డినేటర్ డా. వెంకన్న, డా. టి. శశికళ, కె. పద్మజ, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పోస్టర్లు, నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Breaking News

Subscribe our Newsletter