విజయనగరం జెడ్పీ పీఠం కూటమి కైవసం!

విజయనగరం జెడ్పీ పీఠం కూటమి కైవసం!

20/November/2026 19:32    Share:   

జిల్లా పరిషత్ చైర్మన్‌గా మజ్జి సిరి సహస్ర ఏకగ్రీవ ఎన్నిక

విజయనగరం, నవంబర్ 

విజయనగరం జిల్లా పరిషత్ నూతన చైర్మన్‌గా బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు మజ్జి సిరి సహస్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఆమెను చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె నూతన బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీ నాయన), బుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పాల్గొని నూతన చైర్మన్ మజ్జి సిరి సహస్రకు అభినందనలు తెలిపారు. జిల్లా పరిషత్ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ, ఎన్నారై సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యే కళా వెంకటరావు, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
నూతన చైర్మన్ ఎన్నికతో విజయనగరం జిల్లా పరిషత్‌లో కొత్త పాలనా అధ్యాయం ప్రారంభమైందని పలువురు అభిప్రాయపడ్డారు.

క్రైమ్ ఎనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్ మందపాటి సూర్యనారాయణ రాజు
Breaking News

Subscribe our Newsletter