అనకాపల్లిలో స్థల వివాదం.. GVMC, VMRDA అధికారులపై బాధితుడి ఆరోపణలు!

అనకాపల్లిలో స్థల వివాదం.. GVMC, VMRDA అధికారులపై బాధితుడి ఆరోపణలు!

19/November/2026 20:35    Share:   

అనకాపల్లి | నవంబర్ 

అనకాపల్లిలో తనకు చెందిన స్థలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు GVMC, VMRDA అధికారులు ప్రయత్నిస్తున్నారని ఓ బాధితుడు ఆరోపించారు. ఈ మేరకు నవంబర్ 18న విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.

తన యుక్త వయస్సు నుంచి కష్టపడి సంపాదించిన డబ్బుతో సర్వే నంబర్ 1535/1Aలో సుమారు 1.59 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు బాధితుడు తెలిపారు. ఈ స్థలానికి సంబంధించి హైకోర్టులో Writ Petition No.28701/2025 దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ GVMC, VMRDA అధికారులు తన స్థలంలో ఉన్న నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.

ఈ నెల 16, 17 తేదీల్లో వరుసగా రెండు రోజుల పాటు అధికారులు JCBలతో వచ్చి తన స్థలంలోని నిర్మాణాలను తొలగించేందుకు ప్రయత్నించారని తెలిపారు. పోలీసుల సహాయంతో తనను ఇబ్బందులకు గురిచేశారని, తన వాదన వినకుండా చర్యలకు దిగారని ఆరోపించారు.

తనకు సంబంధించిన కేసు హైకోర్టులో విచారణలో ఉన్నప్పటికీ అధికారులు ఇలా వ్యవహరించడం అన్యాయమని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన స్థలానికి సంబంధించిన హక్కులను కాపాడాలని, GVMC, VMRDA అధికారులు జోక్యం చేసుకోకుండా న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కోరారు.                

శ్రీనివాసరావు అప్పికొండ.
జిల్లా ఇన్చార్జి,క్రైమ్ ఎనాలిసిస్,అనకాపల్లి.
Breaking News

Subscribe our Newsletter