
అనకాపల్లి / నక్కపల్లి, నవంబర్ 18:
అనకాపల్లి,
నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ పొత్తిరెడ్డి శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో, నక్కపల్లి యూపీఎస్ సీఐ మురళి, ఎన్.డి.పి.ఎస్ సెల్ సీఐ రమేష్ గార్ల ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న పాత నేరస్తుడు అడ్డూరి ప్రసాద్ (30), తండ్రి: అప్పారావు, అంబేద్కర్ కాలనీ, కొత్తకోట, రావికమతం మండలం పై రాష్ట్ర ప్రభుత్వం పిట్ యాక్ట్ (PIT NDPS Act, 1988 - సెక్షన్ 3(1)) కింద డిటెన్షన్ ఉత్తర్వులు (G.O.RT.No.1953, తేదీ: 09.11.2026) జారీ చేసింది.ఈ ఉత్తర్వుల మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు.
నేర చరిత్ర:
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయిని సేకరించి, అనకాపల్లి, పొరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తూ ప్రజారోగ్యానికి విఘాతం కలిగిస్తున్న ఇతనిపై గతంలో మూడు కేసులు నమోదయ్యాయి:
పలుమార్లు కేసులు నమోదైనా ప్రవృత్తి మార్చుకోకుండా సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పదేపదే నేరానికి పాల్పడుతుండటంతో జిల్లా ఎస్పీ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ కఠిన చర్య తీసుకుంది.
జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే పీట్ యాక్ట్ కింద జైలుకు పంపుతామని పోలీసు అధికారులు హెచ్చరించారు.