పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ సాధించేందుకు కృషి..

పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ సాధించేందుకు కృషి..

17/August/2026 19:55    Share:   

డాబా గార్డెన్స్ విశాఖపట్నం ఆగస్టు 17 
రాష్ట్రంలో జర్నలిస్టులు స్వేచ్ఛగా పూర్తి స్థాయిలో  సమాచారం సేకరించుకొని వార్తలు రాసుకోవడానికి కేంద్ర .రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు  కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు పేర్కొన్నారు.. ఇందుకోసం కేంద్రం తీసుకువచ్చిన ఐటీ చట్టంలో జర్నలిస్టులకు ఇబ్బందులు లేకుండా సవరణలు చేయాలని అప్పటివరకు దేశవ్యాప్తంగా రాజీలేని పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు సోమవారం డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రెస్ క్లబ్ లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా జర్నలిస్టులు  ఎదుర్కొంటున్న పెను సవాళ్లు అనే అంశంపై ఆంజనేయులు 
ప్రత్యేక ప్రసంగం చేశారు.. గతంలో కేంద్రం తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం ప్రకారం ఎవరైనా ఎప్పుడైనా ఎటువంటి గోప్యత లేకుండా అవసరమైన సమాచారం తీసుకోవచ్చునని చెబుతుందన్నారు.. ఇక 2023లో కేంద్రం తీసుకువచ్చిన ఐటీ చట్టం ప్రకారం సమాచారం సేకరణ విషయంలో అనేక నిబంధనలు ప్రస్ఫుటం చేస్తుందన్నారు.. సమాచారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని గోప్యత పాటించాలని ఎలా పడితే అలా సమాచారం ఇవ్వడం కుదరదని కొన్ని అంశాలు చెబుతున్నాయన్నారు.. కాబట్టి దీనివల్ల నిజాయితీగా వార్తలు రాసే జర్నలిస్టులు కొన్ని సందర్భాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.. కొన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులు సేకరించిన  సమాచారం కు సోర్స్ కోరుతూ అధికారులు పోలీసులు..నోటీసులు ఇస్తున్నారన్నారు.. కావున కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకొని 
పాత్రికేయులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమాచార సేకరణ కోసం అవసరమైన ఐటి చట్టంలో సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. పెన్షన్ సదుపాయం డిమాండ్లు సాధించి తీరుతామన్నారు..
సభకు అధ్యక్షత వహించిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి (ఎన్ఏజే) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ 
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం సాగించి తప్పకుండా సాధిస్తామన్నారు..
అలాగే  జర్నలిస్టుల  హక్కుల సాధనకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు.. ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి కొన్ని సమస్యలు పరిష్కరించగలిగామన్నారు..
ఈసందర్భంగా వీరు స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ లోగో ఆవిష్కరించారు..ఈసమావేశంలో ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ కార్యదర్శి జి శ్రీనివాసరావు  ఉపాధ్యక్షులు బి ..శివప్రసాద్ బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు.. కార్యదర్శి కింతాడ మదన్.. మల్ల దేవ త్రినాథ్ ..స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ కార్యదర్శి శ్రీనివాస్.. కె ఎస్ శర్మ హరి .. బొబ్బర ప్రసాద్. రాజ శేఖర్. చక్రి. కోస్తా ప్రసాద్ ..తదితరులు పాల్గొన్నారు..
Breaking News

Subscribe our Newsletter