అనకాపల్లి జిల్లా,
పాయకరావుపేట: డీఎస్సీ-2025లో జరిగిన అవకతవకలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పాయకరావుపేట నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది.మాజీ శాసనసభ్యులు, పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ కంబాల జోగులు గారి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు, నిరుద్యోగ యువత భారీగా ర్యాలీలో కదలిక చూపించారు.ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు రోప్ వేసి అడ్డుకున్నారు. అయితే ఎన్ని ఆంక్షలు పెట్టినా వాటిని తోసుకుంటూ వైసీపీ శ్రేణులు ముందుకు సాగాయి. "లోకేష్ రాజీనామా చేయాలి", "సీఎం డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేస్తూ యువత, నిరుద్యోగులు కదం తొక్కారు.డీఎస్సీ పరీక్షల్లో జరిగిన కుంభకోణం, విద్యార్థులకు జరిగిన అన్యాయం వంటి అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ, దీనికి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేసింది.