ఏలూరు:
స్థానిక 4వ డివిజన్ పరిధిలోని నాగేంద్ర కాలనీలో శ్రీ శ్రీ శ్రీ నాగేంద్ర స్వామి వారి ఆలయ నిర్మాణ మరియు శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన ఆలయ భూమిపూజ, శంకుస్థాపన పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రెడ్డి గౌరి శంకర్, వేముల బాలుతో పాటు పలువురు కూటమి పార్టీల నాయకులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాగేంద్ర కాలనీ పరిసర ప్రాంతాలు భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.