కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో విశ్రాంతి గది నిర్మించాలని కోరుతు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందచేసిన న్యాయవాది చిక్కా భీమేశ్వరరావు నవసమాజ్ సొసైటీ చైర్మన్ నేతల రమేష్ బాబు బుస్సా తిరుమల రావు
జిల్లా కేంద్రమైన ఏలూరులో గవర్నమెంట్ హాస్పిటలకు నిత్యం వందలాది మంది అనారోగ్యవంతులు వచ్చి వెళుతుంటారని వారిలో కొంతమంది ఇన్ పేషెంట్స్ గా చేరతారని వారికి సహాయకులుగా వారి బందువులు వచ్చి వెళుతుంటారని వారు బోజనం చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి రాత్రి సమయాల్లో నిద్రపోవడానికి గతంలో విశ్రాంతి గది ఉండేది కాని గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజి హాస్పిటల్ అయినతరువాత ఆ విశ్రాంతి గదిని వారి అవసరాలకు వాడుకుంటున్నారు కావున పేషెంట్స్ సహాయుల కొరకు విశ్రాంతి గదిని నిర్మించాలని ఆగదికి కరెంటు సదుపాయం కల్పించి మరుగుదొడ్లు స్నానాల గదులు నిర్మించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందచేశారు