జనసేన పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దరఖాస్తుల స్వీకరణ..
25/August/2026 20:30
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ వినూత్నంగా దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ప్రారంభించింది ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనసేన పార్టీ కోసం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలు నాయకులుగా ఎదగాలని సదుద్దేశంతో ఈ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాం అని రెడ్డి అప్పలనాయుడు మీడియా సమావేశంలో వెల్లడించారు జనసేన తరఫున ఆశావాహులు ఈ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు ఈనెల 25వ తారీకు నుండి ప్రారంభమై 30వ తారీకు వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందని ఈ 5 రోజులు జనసైనికులు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఈ దరఖాస్తుల స్వీకరించడానికి ఐదుగురిని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాఘవయ్య చౌదరి, సిరిపల్లి ప్రసాద్, ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నిమ్మల జ్యోతి కుమార్, కస్తూరి సాయి తేజస్విని లను కమిటీ సభ్యులుగా నియమించారు. ప్రస్తుతం ఏలూరు నియోజకవర్గం లో మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 50 డివిజన్లు ఉండగా వీటిని 62 డివిజన్లో గా విభజన చెంది ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మరింత అభివృద్ధి జరగడానికి దోహదపడుతుందని హర్షం వ్యక్తం చేశారు.