డైట్ లో ‘వైబ్రేంట్ డైట్ – 2026’ వేడుకలకు పోస్టర్ ఆవిష్కరణ

డైట్ లో ‘వైబ్రేంట్ డైట్ – 2026’ వేడుకలకు పోస్టర్ ఆవిష్కరణ

18/November/2026 20:28    Share:   

‘VIBRANT DIET – 2026’ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
దాడి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, అటానమస్, నందు విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, క్రీడా స్ఫూర్తి మరియు ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో 11,12, డిసెంబర్ -2026 న నిర్వహించనున్న  ‘వైబ్రేంట్ డైట్ – 2026’  కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ గారు ప్రిన్సిపల్ ఆర్ వైకుంఠ రావు గారు మరియు వివిధ భాగాధిపతులు  ఘనంగా ఆవిష్కరించింది.ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం విద్యాపరంగానే కాకుండా సాంస్కృతిక, క్రీడా మరియు ఇతర సహపాఠ్య కార్యక్రమాల్లోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, జట్టుగా పనిచేసే నైపుణ్యం, సృజనాత్మకతను పెంపొందిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్లే బ్యాక్ సింగర్ “లిప్సిక భాష్యం” గారు విచ్చేసి లైవ్ లో పాటలతో విద్యార్థులను అలరించునున్నారుఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల కోసం వివిధ వినోదాత్మక, సృజనాత్మక మరియు పోటీ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది.విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఉత్సాహాన్ని నింపడమే ‘VIBRANT DIET – 2026’ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter