అనకాపల్లిలో అక్రమ మద్యం కలకలం: ఇద్దరు అరెస్ట్, 30 సీసాలు స్వాధీనం..

అనకాపల్లిలో అక్రమ మద్యం కలకలం: ఇద్దరు అరెస్ట్, 30 సీసాలు స్వాధీనం..

30/June/2026 08:29    Share:   

అనకాపల్లి టౌన్:
అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు జరిపిన ముమ్మర తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. విజిబుల్ పోలీసింగ్‌ డ్యూటీలో భాగంగా ఎటువంటి లైసెన్స్, ప్రభుత్వ అనుమతులు లేకుండా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి మొత్తం 30 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి:రాము నాయుడు కాలనీలో తనిఖీలు: జూన్ 28 రాత్రి రాము నాయుడు కాలనీ వద్ద జామి దళిరాజు అనే వ్యక్తిని పోలీసులు తనిఖీ చేశారు. అతని వద్ద అక్రమంగా తరలిస్తున్న 20 మద్యం సీసాలను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఎస్‌.ఐ A. వెంకటేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు.సుంకరమెట్ట జంక్షన్ వద్ద పట్టివేత: జూన్ 29 ఉదయం సుంకరమెట్ట జంక్షన్ వద్ద పోలీసులు నిర్వహించిన సోదాల్లో అక్కిరెడ్డి వెంకట అప్పారావు అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 10 అక్రమ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసును ఎస్‌.ఐ D. శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు.మద్యం అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అనకాపల్లి టౌన్ పోలీస్ ఇన్ స్పెక్టర్ శ్రీ జి. ప్రేమ్ కుమార్ పత్రికాముఖంగా హెచ్చరించారు. పట్టణంలో ఎక్కడైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతుంటే ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
Breaking News

Subscribe our Newsletter