పెంచిన పెట్రోల్, డీజిల్,  సి ఎన్ జి  ధరలు వెంటనే తగ్గించాలి.సిఐటియు

పెంచిన పెట్రోల్, డీజిల్,  సి ఎన్ జి  ధరలు వెంటనే తగ్గించాలి.సిఐటియు

16/May/2026 22:02    Share:   

యలమంచిలి అచ్యుతాపురం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై మూడు రూపాయలు కు పైగా పెంచడం దుర్మార్గమని ధరల పెంపు నిరసిస్తూ అచ్యుతాపురం మండల కేంద్రంలో ఆటోకి తాడికట్టి లాగుతూ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది . ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్.రాము, అచ్చుతాపురం మండలం కన్వీనర్ కూండ్రపు సోము నాయుడు మాట్లాడుతూ బెంగాల్, కేరళ ,తమిళనాడు ,అస్సాం , పాండిచ్చేరి ఎన్నికల పలితాలు వచ్చిన పది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం బిజెపి దేశ ప్రజలపై పెట్రోల్ , డీజిల్ ధరలు  బారాలను మోపింది కార్పొరేట్లకు కోట్లాది రూపాయలు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం, ప్రజలపై ధరల బారాన్ని విధిస్తోందన్నారు. ధరలు పెంచే ఉద్దేశంతో ముందుగా పొదుపు చర్యలు పేరుతో ప్రజలకు ఉచిత సలహాలు మోడీ ఇచ్చారన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అంటే ప్రజలను మరింత దరిద్రంలోకి నెట్టడమే అన్నారు. ఇప్పటికే ఉచిత బస్ తో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులపై ధరలు పిడుగుపాటు వంటిదని ఈ ధరలు పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఇప్పటికే వంట గ్యాస్ 50 రూపాయలు వాణిజ్య సిలిండర్ పై వెయ్యి రూపాయలు పెంచడంతో చిరు వ్యాపారులు ,హోటల్ యాజమాన్యాలు మూసివేసారని ,ఉపాధి కోల్పోయారని ధరలు నియంత్రించలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని ప్రజలను గాలికి వదిలేసి కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధంగా విధానాలు చేపడుతున్నారని ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆటో, ముఠా కార్మిక సంఘాల నాయకులు యువశక్తి ఆటో స్టాండ్ అధ్యక్షులు కాకి అప్పలరాజు, శ్రీ కనకదుర్గ ఆటో స్టాండ్ అధ్యక్షులు బొండాడ ఆనంద్, శ్రీ మరిడిమాంబ ఆటో స్టాండ్ కార్యదర్శి రంగాల సన్యాసిరావు ,పి. శంకర్, వై. నూకరాజు, డి త్రినాథ్, డి. శ్రీకాంత్, కె. రాజు ,ఎస్ రమణ, జె. నాయుడు, ఎస్. శివ,  కె. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter