శాఖా గ్రంధాలయం ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు.

శాఖా గ్రంధాలయం ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు.

18/November/2026 07:11    Share:   

​యలమంచిలి : 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని, యలమంచిలి శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో మంగళవారం వివిధ పాఠశాలల్లో విద్యార్థుల కోసం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. ​ఈ పోటీల కార్యక్రమంలో పట్నంలోని స్టేషన్ రోడ్డు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి. భవాని, ఉపాధ్యాయులు సత్యనారాయణ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు జి. మంగపతిరావు, ఉపాధ్యాయులు సి. రాజేశ్వరి, రామలక్ష్మి, అల్లూరి సూర్యకల, భవాని, తులసి, మల్లిక తదితరుల ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ​గ్రంథాలయ ప్రాముఖ్యతను, పుస్తక పఠన యొక్క ఆవశ్యకతను విద్యార్థులలో పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన తఈ చిత్రలేఖన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాలుపంచుకుని తమ ప్రతిభను చాటుకున్నారు. కార్యక్రమ నిర్వాహకులు పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.
Breaking News

Subscribe our Newsletter