
యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు గొల్ల కొండ ఏరియాలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా "ఇంటింటా తెలుగుదేశం" కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు నుంచి 45 రోజులపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేసి ప్రజలకు తెలియజేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొర్లె శివన్నారాయణ (నానాజీ), సెక్రెటరీ ఆడారి ఆదిమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు కొటారు సాంబశివరావు, జిల్లా అధికారి ప్రతినిధి దాడి రమేష్, క్లస్టర్ ఇంచార్జ్ బోద్ధపు శ్రీనివాసరావు, కరణం రవికుమార్, యూత్ అధ్యక్షులు నమ్మి రమణ, వార్డ్ ఇంచార్జ్ ఊట సతీష్, కరెడ్ల మల్లికార్జునరావు, ఎస్ రమణ బాబు, రాజ మహేష్, షేక్ ఖాసిం, ముమ్ముని శ్రీను, దేవా నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.