ప్రధాన కూడళ్లలో స్పీడ్ లిమిట్, ప్రమాద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు!
అనకాపల్లి: రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది అనకాపల్లి డీఎస్పీ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్,ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో కలిసి కొత్తూరు జంక్షన్, నూకాలమ్మ ఆర్చ్ జంక్షన్, ఉమ్మలాడ జంక్షన్ ప్రాంతాలను సందర్శించారు.ఈ సందర్భంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించి వాహనదారుల భద్రత కోసం స్పీడ్ లిమిట్ బోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయించారు. అదేవిధంగా కొత్తూరు జంక్షన్ నుంచి కశింకోట వరకు రహదారి మధ్యలోని డివైడర్‌పై విద్యుత్ లైటింగ్ పోల్స్ ఏర్పాటు చేశారు.వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నిర్ణీత వేగ పరిమితిలోనే వాహనాలు నడపాలని పోలీస్ అధికారులు సూచించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉంటూ రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదాల నివారణలో పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని కోరారు.
క్రైమ్ అనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస రావు అప్పికొండ