
విశాఖపట్నం | అనకాపల్లి : స్థానిక జీవీఎంసీ మెయిన్ హైస్కూల్ విద్యార్థులు ముగ్గురు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీ బ్రహ్మాజీ గారు తెలిపారు.
8వ తరగతి చదువుతున్న K. చందు ఫుట్బాల్ U-14 విభాగంలో ఎంపికై రంపచోడవరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
9వ తరగతి చదువుతున్న Sk. సుభాని వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఎంపికై కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
10వ తరగతి చదువుతున్న K. లతిక్ కుమార్ ఫుట్బాల్ విభాగంలో ఎంపికై రాజమండ్రిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
ఎంపికైన విద్యార్థులను పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ ఎస్.వి. నరసింహం గారిని, విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు శ్రీ బ్రహ్మాజీ గారు, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు మరియు తల్లిదండ్రులు అభినందించారు.