మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలు..
16/November/2026 22:49
Share:
యలమంచిలి : పట్నంలోని భాష్యం స్కూల్ ప్రాంగణంలో ఎన్ఆర్ వి సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లా రామాకుమారి, 22వ వార్డు కౌన్సిలర్ దాడి రమేష్, భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ దేముడు, మాజీ సైనికులు, బిజెపి సీనియర్ నాయకులు నక్క శివ శంకర్ హాజరయ్యారు. బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామినర్‌గా బి.కె. రత్నం (రామచంద్రాపురం) వ్యవహరించారు. ఈ గ్రేడింగ్ పరీక్షలలో మొత్తం 32 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఎల్లో బెల్ట్ 11 మంది, గ్రీన్ బెల్ట్ 12 మంది, ఆరెంజ్ బెల్ట్ 3 మంది, బ్రౌన్ బెల్ట్ 6 మంది సాధించినట్లు తెలిపారు. ఎస్.కె. ఆఫ్రీన్ (1వ క్యూ), కె. హైతీ (1వ క్యూ), బి. వైష్ణవి (2వ క్యూ), పి. వర్షిణి (2వ క్యూ), ఎస్.కె. ఆయేషా (2వ క్యూ), ఎస్. జయసూర్య (3వ క్యూ) లు సాధించారు. ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకులు షిహాన్ నక్క వెంకట్రామన్ మాట్లాడుతూ.. నేటి కాలంలో విద్యార్థులు కరాటే నేర్చుకోవడం ఎంతో అవసరమన్నారు. కరాటే వల్ల ఆత్మరక్షణ మెలకువలే కాకుండా, చదువులో ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడతాయని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక బలం పెంపొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.