SKBA బ్యాడ్మింటన్ అకాడమీకి చెందిన క్రీడాకారులు అమరావతి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికై సత్తా చాటారు.అకాడమీకి చెందిన ఆర్. భూమిక, సీహెచ్. జావలి, జ్ఞానవి (U-23), జ్ఞానేశ్వరిలు ప్రతిష్టాత్మక ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు.వారి ప్రతిభను అభినందిస్తూ అనకాపల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు దాడి జయవీర్, కోచ్ సురేష్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి SKBAతో పాటు అనకాపల్లి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ SKBA అందిస్తున్న శిక్షణకు ఈ ఎంపికలు నిదర్శనమని క్రీడాభిమానులు అభినందించారు.
శ్రీనివాసరావు అప్పికొండ.జిల్లా ఇన్చార్జి,క్రైమ్ ఎనాలిసిస్,అనకాపల్లి.