
నవంబర్ 30 నుండి రాష్ట్రస్థాయి పోటీలు
- జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి పూజారి శైలజ
అనకాపల్లి (స్పోర్ట్స్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) వీసీ అండ్ ఎండీ,జిల్లాలోని దివ్యాంగులకు క్రీడా ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి శ్రీమతి పూజారి శైలజ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, విభిన్న ప్రతిభావంతులు - ట్రాన్స్‌జెండర్స్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరగనున్నాయి.25-11-2026 బుధవారం ఉదయం 9:00 గంటలకు అనకాపల్లిలోని ఎన్టీఆర్ స్టేడియం మరియు రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ క్రీడా పోటీలు నిర్వహించబడతాయి.
పోటీలు జరిగే క్రీడాంశాలు ఇవే.. 13 సంవత్సరాలు పైబడిన దివ్యాంగ బాలురు, బాలికలకు ఈ కింది క్రీడలలో ఎంపికలు నిర్వహిస్తారు:
పారా అథ్లెటిక్స్
పారా బ్యాడ్మింటన్ (సింగిల్స్ మాత్రమే)
పారా టేబుల్ టెన్నిస్ (సింగిల్స్ మాత్రమే)
పారా తైక్వాండో
వీల్ చైర్ ఫెన్సింగ్
బ్లైండ్ గోల్ బాల్
హాజరయ్యేవారు తీసుకురావాల్సిన ధృవపత్రాలు: ఎంపికలలో పాల్గొనడానికి ఆసక్తి, అర్హత గల దివ్యాంగ క్రీడాకారులు తమ సొంత క్రీడా సామగ్రితో పాటు.. దివ్యాంగ ధృవీకరణ పత్రం (సదరం సర్టిఫికెట్), ఆధార్ కార్డు, జనన ధృవీకరణ పత్రం లేదా 10వ తరగతి మార్కుల జాబితాతో హాజరు కావాలి.
రాష్ట్ర స్థాయికి ఎంపిక: ఈ జిల్లా స్థాయి ఎంపికల్లో గెలుపొందిన క్రీడాకారులు నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో అనకాపల్లి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని అధికారిణి పేర్కొన్నారు.
క్రీడలకు సంబంధించి మరిన్ని వివరాలకు బాక్సింగ్ కోచ్ కె. త్రిమూర్తులు (9335777778), తైక్వాండో కోచ్ ఎం. చిరంజీవి కుమార్ (9593315444) నంబర్లను సంప్రదించగలరు.