అంతర్జాతీయ మహిళా వారోత్సవాల భాగంగా విద్యార్థినులకు ఆత్మరక్షణ కార్యక్రమం

అంతర్జాతీయ మహిళా వారోత్సవాల భాగంగా విద్యార్థినులకు ఆత్మరక్షణ కార్యక్రమం

05/March/2026 07:35    Share:   

యలమంచిలి : ​అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు యలమంచిలి పట్టణంలోని భాష్యం స్కూల్‌లో విద్యార్థినులకు ఆత్మరక్షణ (సెల్ఫ్ డిఫెన్స్) పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. యలమంచిలి టౌన్ ఎస్ఐ సావిత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగిరెడ్డి వెంకటరమణ, శ్రీనుల సహకారంతో విద్యార్థినులకు ఆత్మరక్షణ మెళకువలను నేర్పించారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మహిళలు, యువతులు భయపడకుండా తమను తాము ఎలా రక్షించుకోవాలో ఈ శిక్షణలో ప్రాక్టికల్‌గా వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సమాజంలో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రతి ఒక్కరూ ఇటువంటి ఆత్మరక్షణ విద్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆపద సమయాల్లో ఈ మెళకువలు ఎంతో ధైర్యాన్ని, రక్షణను ఇస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter