రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు యలమంచిలి కొత్తపేట విద్యార్థులు
10/October/2026 07:09
Share:
యలమంచిలి :
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నక్కపల్లి హాకీ మైదానంలో జరిగిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా హాకీ సెలక్షన్స్ లో అండర్ 17 విభాగంలో టి. ఖన్నా, జి. నితీష్ వర్ధన్, బి. సత్యనారాయణ, కొటారు లక్ష్మి మహేష్, కె. శరణ్య, ఐ. సునీత, అండర్ 19 విభాగంలో బి. పావని ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పీ.డీ. కుందూరు రాజు తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై. వి. రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం లో విద్యార్థులను, వారికి తర్ఫీదు నిచ్చిన వ్యాయామం ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు కుందూరు రాజు, కిషోర్ కుమార్, విజయ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు