పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారులకు రూ.40 వేల  ఆర్థిక సహాయం అందించిన కిమిడి రామ్ మల్లిక్ నాయుడు

పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారులకు రూ.40 వేల ఆర్థిక సహాయం అందించిన కిమిడి రామ్ మల్లిక్ నాయుడు

17/October/2026 19:35    Share:   

రాజాం అక్టోబర్ 17:
దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌–2026లో పాల్గొననున్న క్రీడాకారులను ప్రోత్సహిస్తూ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు రాజాంలోని వారి నివాసంలో  రూ.40 వేల ఆర్థిక సాయం అందించారు..కేరళ రాష్ట్రంలోని కన్నూర్‌ ముండయాడ్ ఇండోర్ స్టేడియంలో నవంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌–2026 జరగనుంది. కేరళ రాష్ట్ర పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్, కన్నూర్ జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి.ఈ పోటీల్లో వై.వి. ప్రసాద్, శివరామ్, బాల సుబ్రహ్మణ్యం, బి. రవి, బి. సరస్వతి, ఆర్. రమణి ప్రియ పాల్గొననున్నారు.క్రీడాకారులు పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని ఆకాక్షిచారు. 
Breaking News

Subscribe our Newsletter