యలమంచిలి ప్రీమియర్ లీగ్ గ్రాండ్ ఫినాలే విజేతగా రామ్ వారియర్స్..!!

యలమంచిలి ప్రీమియర్ లీగ్ గ్రాండ్ ఫినాలే విజేతగా రామ్ వారియర్స్..!!

28/June/2026 20:29    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
యలమంచిలిలో నిర్వహించిన యలమంచిలి ప్రీమియర్ లీగ్ (EPL) సీజన్–1 విజయవంతంగా ముగిసింది. దాదాపు 50 రోజుల పాటు సాగిన ఈ టోర్నమెంట్‌లో 7 జట్లు పాల్గొని ప్రేక్షకులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను అందించాయి.ఐపీఎల్ తరహాలో ఆటగాళ్ల ఎంపిక (ఆక్షన్) నిర్వహించి, ఎలమంచిలి ప్రాంతానికి చెందిన ప్రతిభావంతులైన క్రికెటర్లతో జట్లను రూపొందించారు. ఈ టోర్నమెంట్ నిర్వహణలో కర్రి జోగు నాయుడు కీలక పాత్ర పోషించారు.ఫైనల్ పోరులో జోగి టైటాన్స్ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రామ్ వారియర్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసి EPL సీజన్–1 ఛాంపియన్‌గా నిలిచింది.ఈ టోర్నమెంట్‌కు లండన్‌లో స్థిరపడిన సోమలింగపాలెం వాస్తవ్యులు సుధాకర్ మరియు మురళి కలిసి రూ.65,000 నగదు బహుమతిని విరాళంగా అందించారు.

విజేతలు
ప్రథమ బహుమతి: రామ్ వారియర్స్
ద్వితీయ బహుమతి: జోగి టైటాన్స్
తృతీయ బహుమతి: ఎస్‌వి సూపర్ కింగ్స్

యలమంచిలి పెద్దపల్లి గ్రౌండ్లో నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో సుధాకర్, దాసరి గణేష్, లంక ఉదయ్, కుమార్, బొద్దప్పు తులసి విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులను అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఎలమంచిలి యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ లీగ్‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని, భవిష్యత్తులో మరింత వైభవంగా తదుపరి సీజన్‌ను నిర్వహిస్తామని తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter