రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీనివాస కళాశాల విద్యార్థులు..
06/October/2026 07:29
Share:
చీపురుపల్లి అక్టోబర్ 5,
ఉత్తరాంధ్ర సూర్య.చీపురుపల్లి శ్రీనివాస జూనియర్ కళాశాల విద్యార్థులు కబడ్డీ మరియు కుస్తీ పోటీలలో రాష్ట్రస్థాయి పోటీలకు ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్లు జిల్లా స్థాయిలో నిర్వహించిన సెలక్షన్స్ నందు కుస్తీ పోటీలలో అండర్ 19 విభాగంలో కె. లాస్య, పి. సమీల, పి. నీలవేణి, కృష్ణవేణి, జి. ఆకాంక్ష, మరియు ఢిల్లీ శ్వర్ లు ఎంపికయ్యారు . వీరు ఈనెల 10,11,12 తేదీలలో పల్నాడు జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా తరపు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.కళాశాల ప్రిన్సిపాల్ ఏ డి ఎన్ ఎస్ వి ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ ఏ పి వి ఎన్ ఎస్ మూర్తి, కోచ్ నాగరాజు తదితర అధ్యాపకులు అభినందించారు ...