విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికిన ఎంపీ కలిశెట్టి!
11/November/2026 20:17
Share:
విజనగరం జిల్లా ప్రతినిది మందపాటి సూర్యనారాయణ రాజు
విశాఖ.. విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు విశాఖపట్నం చేరుకున్న సందర్భంగా విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు, ఎమ్మెల్యే శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారు, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.రెండు రోజుల పాటు విశాఖపట్నంలో జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి నారా లోకేష్ గారు పాల్గొననున్నారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, నూతన పరిశ్రమలు, యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్చలు జరగనున్నాయి.రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ఈ సదస్సు వేదిక కానుంది.