స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలను ఖండించండి ,సిపిఎం

స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలను ఖండించండి ,సిపిఎం

11/November/2026 16:04    Share:   

రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని బిజెపితో జతకట్టిన డబుల్ ఇంజన్ సర్కార్ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని దీనిని నిరసిస్తూ రాష్ట్ర పిలుపులో భాగంగా అచ్చుతాపురం నాలుగు రోడ్ల కూడలి లో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అచ్యుతాపురం కన్వీనర్ ఆర్ రాము, సిపిఎం సీనియర్ నాయకులు కర్రి అప్పారావు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్ధులను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం నామినేషన్ పత్రాలను చిoచడం భౌతిక దాడులు చేయడం పోలింగ్, కౌంటింగ్ లో రిగ్గింగ్ చేయడం లాంటి అనేక ఘటనలు అనేక ప్రాంతాల్లో జరిగాయని గతంలో వైసిపి చేసింది కాబట్టి ఇప్పుడు మేము చేస్తామని టిడిపి సమర్థించుకుంటుంది రెండు సంవత్సరాల తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని వైసిపి నేతలు చేస్తున్న ప్రకటనలు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తున్నారు కమ్యూనిస్టులను అడ్డుకున్నారు ఈఎన్నికల్లో డబ్బు ,మద్యం వేద జళ్లడంతో పాటు హింసకు పాల్పడ్డారు రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు చేస్తూ ప్రజాస్వామ్య గొంతు నొక్కుతున్నారని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాబోయే సర్పంచ్ ఎన్నిక సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో గంగిరెడ్డి నారాయణమ్మ, ఆర్ లక్ష్మీ, కడారి అప్పారావు ,వసంత, చాపల తాతీయులు ,రాము తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter