బాధిత నర్సింగ్ విద్యార్థినికి అండగా..!!  "మనం చారిటబుల్ ట్రస్ట్"..!!!

బాధిత నర్సింగ్ విద్యార్థినికి అండగా..!! "మనం చారిటబుల్ ట్రస్ట్"..!!!

10/May/2026 14:32    Share:   

 
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ - యలమంచిలి :
 
యలమంచిలి 1996-97 బ్యాచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులచే స్థాపించబడిన మనం చారిటబుల్ ట్రస్ట్ ఆపదలో ఉన్న ఓ నిరుపేద నర్సింగ్ విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించింది.
 
సైతార్‌పేటకు చెందిన బేపుల గౌతమి విశాఖపట్నం చినముషిడివాడలో నర్సింగ్ విద్యను అభ్యసిస్తోంది. ఇటీవల ఆమె రోడ్డు ప్రమాదానికి గురికాగా, తీవ్రంగా గాయపడి మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. అత్యవసర శస్త్రచికిత్స అవసరమని, ఇందుకు సుమారు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు.
 
గౌతమి కుటుంబం ఆర్థికంగా వెనుకబడినది కావడంతో అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆమె స్నేహితుల ద్వారా మనం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను సంప్రదించి సహాయం కోరారు. బాధితురాలి పరిస్థితిని పరిశీలించిన ట్రస్ట్ సభ్యులు స్పందించి ఆదివారం యలమంచిలి టౌన్ ఎస్ఐ కె. సావిత్రి చేతుల మీదుగా రూ.30,000 ఆర్థిక సహాయం అందజేశారు.
 
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు మురుకుర్తి గోపి, ఉపాధ్యక్షుడు ఎస్. సతీష్, వ్యవస్థాపక కార్యదర్శి పి. సురేష్, కోశాధికారి సీహెచ్. శ్యామలరావు, సభ్యులు కర్రి వీరునాయుడు, ఏ. మణికుమార్, తంగేటి సూర్యప్రకాశ్, టివి సూర్య ప్రకాష్ , కొసనం రామగోవింద్, టి. దేవదాస్, దొడ్డి వెంకటేష్, అల్లు రత్నరాజు, ఎం. ప్రసాద్, ఎన్. రాజేష్, రావి నాగకుమారి, రావి హేమ, పి. సంతోష్, ఎస్. జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter