ఏలూరులో  

ఏలూరులో  'హర్ ఘర్ తిరంగా'  ర్యాలీ..

13/August/2026 20:08    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 
స్వాతంత్ర   దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లావ్యాప్తంగా జాతీయ సమైక్యత, సమగ్రతలను చాటిచెప్పే విధంగా "హర్ ఘర్ తిరంగా  ర్యాలీ"లు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.  ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేలా ర్యాలీ నిర్వహించాలన్నారు.  ఏలూరు నగరంలో ఈనెల 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు ఇన్డోర్ స్టేడియం నుండి పెద్దఎత్తున ప్రజలతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ఈ ర్యాలీ లో ప్రజలు, విద్యార్థులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాలతో పాల్గొంటారన్నారు.  "హర్ ఘర్ తిరంగా  ర్యాలీ" లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలనీ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.   ఆగస్టు 13 నుండి 15 వరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై, కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగరేయాలని జిల్లా యంత్రాంగం ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు.
Breaking News

Subscribe our Newsletter