
అమరావతి, నవంబర్
13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం 90 రోజుల్లో అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
చిన్నారులపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక కార్యక్రమం / చట్టం తీసుకురానుందని ఆయన తెలిపారు. 13 నుంచి 18 ఏళ్ల వయస్సు పిల్లల విషయంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసే అంశంపై కూడా చర్చిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.
పిల్లల భవిష్యత్తు, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.