ఎస్.సి.,బాలికల వసతి గృహాల సమస్యలను పరిష్కరించండి,ఏఐఎస్ఎఫ్.
30/June/2026 08:25
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు ఏలూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ వసతి గృహాల సమస్యలు పరిష్కరించడం తోపాటు, తక్షణం చింతలపూడి బాలికల వసతి గృహ సమస్యలపై దృష్టి సారించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.శివకుమార్, కె.సిద్దు, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ టి.రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్.సి.,బాలికల వసతి గృహాన్ని ఏఐఎస్ఎఫ్, బృందం పరిశీలించింది. ఆదివారం అక్షయ అనే హాస్టల్ విద్యార్థిని ని హాస్టల్ నుండి గెంటివేసిన సంఘటనను, వసతి గృహంలో ఉన్న సమస్యలను పరిశీలించింది. ఈ సందర్భంలో హాస్టల్ను తనిఖీకి వచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ వై విశ్వమోహన్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డి శివకుమార్, సిద్దు,టి.రాజు మాట్లాడుతూ ఎస్.సి., హాస్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, వార్దన్లతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.ప్రభుత్వం జోక్యం చేసుకొని తక్షణమే ఎస్.సి.,బాలికల వసతి గృహంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని,లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, నాయకులు ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివకుమార్ జిల్లా కార్యదర్శి కె. సిద్దు.ఏఐవైఎఫ్ , ఏలూరు జిల్లా కన్వీనర్ టి.రాజు.చంటి,విజయ్, గోపి,పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు పాల్గొన్నారు.