మహాశివరాత్రి  శ్రీశైలం  పాదయాత్ర

మహాశివరాత్రి శ్రీశైలం పాదయాత్ర

02/February/2026 16:10    Share:   

ప్రతి యేటా మహాశివరాత్రి 
పురస్కరించుకుని ఆంధ్ర, తెలంగాణ,కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అడవి మార్గం గుండా పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకుంటారు శివ భక్తులు. ఈ యాత్ర  మహా అద్భుతంగా, ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఈ సందర్భంగా  పాదయాత్ర
ద్వారా  శ్రీశైలం చేరుకునే భక్తులకు దేవస్థానం వారు తగు సూచనలు అందజేశారు.
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పాదయాత్ర వెళ్ళే భక్తులకు ఫిబ్రవరి నెల 8 నుండి 15 వరకు అడవి మార్గం గుండా వెళ్లడానికి అటవీశాఖ వారు అనుమతులను మంజూరు చేయడమైనది.
1.    ప్లాస్టిక్ వస్తువులు అడవి మార్గంలో నిషేధం 
2.ఈ పాదయాత్ర ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి వెంకటాపురం నుండి మొదలవుతుంది. కావున భక్తులు తమ వాహనాలను ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి చెక్పోస్ట్ వరకు తీసుకువెళ్లి అక్కడనుండి కాలినడకన బయలుదేర వలసి ఉంటుంది.
3. దారినడకలో ఫోన్ సిగ్నల్ ఉండదు. అందుకు తగ్గట్టుగా మీరు సిద్ధంగా ఉండగలరు. డిజిటల్ పేమెంట్స్ పనిచేయవు. కావున తగినంత చిల్లర మీతో తీసుకువెళ్ళండి.
4.  కాలినడక దారిలో మధ్యలో అన్నప్రసాద వితరణ జరుగుతుంది . దప్పిక ఎక్కువగా ఉంటుంది .. కావున తగినన్ని నీళ్లు మీ వెంట తీసుకెళ్లండి.మధ్యలో నీళ్లు అమ్ముతుంటారు. మీ బాటిల్స్ లో వాటిని నింపుకోవచ్చు.
5.  వైద్య సౌకర్యాలు నియమించబడిన ప్రదేశాలలో అందుబాటులో ఉంటాయి. .
Breaking News

Subscribe our Newsletter