కొచ్చిలో CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు:

కొచ్చిలో CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు:

08/November/2026 09:10    Share:   

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2029 సార్వత్రిక ఎన్నికల్లో గద్దె దిగాల్సిందేనని కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు.

శనివారం కొచ్చిలోని రాజేంద్ర మైదానంలో నిర్వహించిన ‘జంతర్ మంతర్ @ కొచ్చి’ నిరసన సభలో ఆయన ప్రసంగించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సభ జరిగింది.

త్రివర్ణ పతాకం చేతబూని ప్రసంగించిన దీప్కే.. “మోదీ 2029లో గద్దె దిగుతారు. ప్రభుత్వ మార్పు అనేది ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థ ద్వారానే జరగాలి, అందుకోసం 2029 వరకు వేచి చూడాల్సి వచ్చినా సరే” అని స్పష్టం చేశారు. ఇది కేరళలో ఆయన తొలి బహిరంగ ప్రసంగం.

‘జ్ఞానేష్ కుమార్ మోదీకి ఎందుకంత ముఖ్యం? సొంత దేశ యువతపై ప్రభుత్వం పోరాటం చేస్తోందా?’ అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో నిరసనలపై పోలీసు చర్యను తప్పుబట్టారు. ఒకప్పుడు మన్మోహన్ సింగ్‌ను ఎగతాళి చేశారని, ఇప్పుడు అదే పరిస్థితి మోదీకి ఎదురవుతోందని వ్యాఖ్యానించారు.

కేరళ విద్య, అక్షరాస్యతను ప్రశంసించిన దీప్కే.. ఇతర రాష్ట్రాలు కేరళను ఆదర్శంగా తీసుకుంటే భారత్ ఎప్పుడో అభివృద్ధి చెందిన దేశంగా మారేదని అన్నారు. CJP అరాచకవాదుల ముఠా అనే బీజేపీ విమర్శలను ఆయన తిప్పికొట్టారు. అక్టోబర్ 10న ఢిల్లీలో తలపెట్టిన నిరసనపై ఉక్కుపాదం మోపడం ప్రభుత్వ భయాన్ని బయటపెట్టిందని అన్నారు.

ఈ కార్యక్రమానికి ముందు నటుడు-సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ ఆధ్వర్యంలో మెరైన్ డ్రైవ్ నుంచి రాజేంద్ర మైదాన్ వరకు ర్యాలీ జరిగింది. సీపీఐ(ఎం) నేత పి. రాజీవ్, రచయిత ఎన్.ఎస్. మాధవన్, మాజీ ఎంపీ సెబాస్టియన్ పాల్, న్యాయవాది కాలీశ్వరం రాజ్, SFI, AISF, AISA నేతలతో పాటు వందలాది మంది యువత, పౌర హక్కుల కార్యకర్తలు పాల్గొన్నారు.

Breaking News

Subscribe our Newsletter